శతాశాబ్దాల ఘణ చరిత్ర కల్గిన కౌలస్ కోటను రక్షించుకుందాం..

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామములోని శతాబ్దాల ఘణ చరిత్ర కల్గిన చారిత్రాత్మకమైన నిర్మాణమైన కౌలాస్ కోటను రాష్ట్ర ఎక్సైజ్, పర్యటక, సాంస్కృతిక,  పపరావస్తు శాఖ మంత్రి వర్యులు , ఉమ్మడి జిల్లా ఇంచార్జీజీ మంత్రి జూపల్లి కృష్ణారావ్ , ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ తోట శనివారంనాడు సందర్శీంచారు. ఈ సంధర్భంగా కౌలాస్ కోట రాజ వంశస్తుల కుటుంబాలైన అనీతా సింగ్, అనూప్ సింగ్ తో కలిసి మంత్రి జూపల్లిని కలిసి కౌలాస్ కట గత పూర్వ చరిత్రను పూర్తీ వివరాలతో వివరించారు. మంత్రి, స్థానిక ఎమ్మెలే మాట్లాడుతు గతపాలకుల నిర్లక్ష్యం వలన ఎంతో చరిత్ర కల్లినఈ  కోటలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, పునర్ నిర్మాణ పనులు చేపట్టి ఈ చారిత్రాత్మక వారసత్వ సంపదను కాపాడుకోవాలని  మంత్రి గారు వివిరించారు. బారత స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ పాలకుల  వెన్నులో వణుకు పుట్టించిన  చరిత్ర  కౌలాస్ కోటకు ఉంది. సర్వాయి పాపన్న కోటలో తల దాచుకున్నాడని, అష్ట బుజ భవానీ మాతా బంగారుతల్లి మందిరం తెలంగాణలోని  కౌలాస్,   మహరాష్ట్ర లోని ఖందర్ లలో మూడు చారిత్రాత్మక   స్థలాలో నిర్మితమై కొలువైనారని స్థలపురాణాలు తెలుపుతున్నాయి. ప్రతిష్టించబడినాయని రాజ వంశీయులు విఙ్ఞప్తి చేసారు. అంతకు ముందు కౌలాస్ రాజ వంశీయులు, స్థానిక ప్రజాప్రతి నిధులు, మంత్రిని జుక్కల్ సంప్రదాయం ప్రకారం గాందీ టోపి, శాలువాతో, మంత్రి జూపల్లిని కృష్ణారావ్, ఎమ్మెలే లక్ష్మీకాంతారావ్ తోట ను పుష్పగుచ్చం అందించి శాలువాతో  ఘణంగా సన్మానించారు.