– చెరువుల పరిరక్షణ కమిటీ నాయకులు
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
చెరువులను కాపాడుకుందామని చెరువుల పరిరక్షణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం షాపూర్ నగర్‌లో జరిగిన సమావేశంలో కమిటీ నాయకు లు మాట్లాడుతూ మన ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు తరాలు నీటి సమస్య లేకుండా జీవించాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరు వులను కాపాడుకోవడం, పూడికతీత పనులను చెప్పట డం, ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవడం ముఖ్యమని వాటి ప్రాధాన్యతను ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించే విధంగా కుత్బుల్లాపూర్ మండల చెరువుల పరిరక్షణ కమిటీ పనిచెయ్యాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కమిటీ ఆధ్వర్యంలో నీటి ఆవశ్యకత పై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని తెలిపారు. చెరువుల పరిరక్షణకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం,ప్రజల సహకారంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమలలో మేధావులు, యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా కదలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు ఉమా మహేష్, రవీందర్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, యాకయ్య, రాజు,హరినాథ్,ప్రవీణ్ లు హాజరయ్యారు.