సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం యువకథానాయకుడు తేజ సజ్జ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ఈ సినిమా నుంచి ‘మా ఊరు..’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. పాట తనకు ఎంతో నచ్చిందన్న ఆయన మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సాంగ్‌కు రెహ్మాన్ లిరిక్స్ అందించగా, శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించారు. కాళభైరవ పాడారు. ‘రారో మా ఊరు సిత్రాన్ని సూద్దాం…ఇటు రారో ఈ బతుకు పాటను ఇందాం. ఈ సన్నాయి నొక్కుల్లోనా ఊరించే సంగతులెన్నో ఉన్నారు..’అంటూ వినగానే ఆకట్టుకునేలా సాగిందీ పాట.
కామెడీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం – శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్, ఎడిటింగ్ – కొదాటి పవన్ కల్యాణ్.