ఉద్యమకారుడికి అండగ నిలబడుదాం

నవతెలంగాణ- రామారెడ్డి: తెలంగాణ ఉద్యమ కారునిగా, కష్టాల్లో ఉన్న పేదలకు నేనున్నానని భరోసా కల్పించిన స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ను, మరోసారి ఎన్నికల్లో కారు గుర్తుకు  గెలిపించి, ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కన్నాపూర్ తాండ సర్పంచ్ చందర్ నాయక్, ఉప సర్పంచ్   నాయకులతో ఆదివారం అన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి, బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాములు, శంకర్, మాన్సింగ్, కొమిరియా, తదితరులు పాల్గొన్నారు.