యాక్షన్‌ ఎపిసోడ్‌తో షురూ..

నాని, వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో రెండో సినిమాగా వస్తున్న ‘సరిపోదా శనివారం’ గత నెలలో గ్రాండ్‌గా లాంచ్‌ అయ్యింది. నానిని యాక్షన్‌ అవతార్‌లో ప్రజెంట్‌ చేసిన యూనిక్‌ అడ్రినలిన్‌ రష్‌తో కూడిన అన్‌చైన్డ్‌ వీడియోకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో యాక్షన్‌ ఎపిసోడ్‌తో ప్రారంభమైంది. రామ్‌-లక్ష్మణ్‌ మాస్టర్లు ఈ హైవోల్టేజ్‌ ఎపిసోడ్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొన్ని టాకీ పార్ట్‌కి సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. నానితో పాటు సినిమాలోని ప్రధాన ఆర్టిస్టులు షూటింగ్‌లో భాగం కానున్నారు.
ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.