నవతెలంగాణ – అచ్చంపేట
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతిని చైతన్య జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎండి సయ్యద్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వచ్చిన సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్ మల్లేష్ మాట్లాడారు. భగత్ సింగ్ 19O7 సెప్టెంబర్ 27వ తారీఖున లాల్పూర్ జిల్లా బంగా గ్రామము లో జన్మించినాడు. భగత్ సింగ్ చిన్నతనము నుండి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన 13వ ఏటని జలియన్వాలాబాగ్ దురంతం చూసిన తర్వాత ఈ దేశము నుండి బ్రిటిష్ వాళ్ళను పిట్టల్లాగా కాల్చిపాడే యలనుకున్నాడు. జనరల్ ఓడయ్యరు వాని దురాగతానికి జలియన్వాలాబాగ్లో 1200 మంది భారతీయులు అమరులైనారని గుర్తు చేశారు. భగత్ సింగ్ అమరత్వం స్ఫూర్తితో బ్రిటిష్ వాళ్లను ఈ దేశం నుండి తరిమేయాలని భగత్ సింగ్ రాజగురు, సుఖదేవులు కంకణం కట్టుకున్నారని అన్నారు. ముగ్గురు అతి చిన్న వయసులోనే ప్రజల కోసం, ఈ దేశం కోసం, కార్మికుల కోసం ఉరికంభము ఎక్కినటువంటి గొప్ప వీరులు అని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మల్ల మూడోసారి ఎలా అధికారంలోకి రావాలని ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష నాయకుల పైన ఈడి దాడులు, సిబిఐ దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నదన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అయోధ్య రాముని పేరు చెప్పి ఓట్లు దండుకోవాలనీ, ఇంటికో కాషాయ జెండా, ప్రతి ఇంటికి అక్షింతలు పంపుతున్నామని సంకేతాలిచ్చి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇది ఈ దేశ లౌకిక ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పార్టీని ఓడించకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి పుట్టగతులు ఉండవని వారు అన్నారు. బీజేపీని ఎట్టి పరిస్థితులలో కచ్చితంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు సమీర్, మణికంఠ, మహిళా నాయకురాలు ప్రణీత, భవాని , సంధ్య, తదితరులు పాల్గొన్నారు.