భారత్ జోడో యాత్రను స్ఫూర్తిగా తీసుకుందాం

–  టిపిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం 
నవతెలంగాణ – సిద్దిపేట
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జొడో యాత్రను స్ఫూర్తిగా తీసుకొని నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేద్దామని పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు.  పట్టణంలో గురువారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర  ఏడాది పూర్తి కావడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక బిజేఆర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. బాణాసంచా కాల్చుతూ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ జోడోయాత్ర పేరిట రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి ఎంతో స్పందన లభించిందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ నేరుగా వెళ్లడం అభినందనీయమన్నారు. 145 రోజుల్లో 12 రాష్ట్రాల్లో దాదాపు 4081 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదని, కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమైందని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల వారికి రోజులు దగ్గరలో పడ్డాయని , త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అత్తు ఇమామ్, ముగ్ధం లక్ష్మీ , తప్పేట శంకర్, బిక్షపతి, మిట్టపల్లి గణేష్, సుంచు రమేష్, గయాజుద్దీన్ ,మధు, ఫయాజ్ ,అశోక్ గౌడ్ , మెరుగు రాజు, నరసవ్వ , స్వప్న,  పుల్లూరు కనకయ్య , రాశాద్ , రాకేష్,  శాబుద్దిన్,   యాదగిరి, అరిఫ్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు