మన జీవితంలో అత్యంత ప్రభావశీలమైన సంభాషణ మనం ఇతరులతో మాట్లాడేది కాదు, మనతో మనం మాట్లాడుకునేదే. మన ఆలోచనల రూపంలో నిత్యం మనలో జరిగే ఈ ఇంటర్నల్ డైలాగ్‌నే స్వయం భాష (Self-Talk) అంటారు. ఇటువంటి సంభాషణ సాధారణంగా మహిళలకే ఎక్కువ అవసరం. ఈ భాష చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది మన భావోద్వేగాలను, ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాలను, విజయాలను ప్రభావితం చేస్తుంది. మన ఆలోచనలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా చూస్తామో ఆ దృక్పథాన్ని తీర్చిదిద్దుతాయి.
Mirror Work అనేది మన స్వయాన్ని శక్తివంతం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రభావవంతమైన పద్ధతి. దీని మూలాలను రచయిత లూయిస్ హే విస్తృతంగా ప్రచారం చేశారు. “You Can Heal Your Life” అనే తన ప్రసిద్ధ పుస్తకంలో ఆమె Mirror Work విలువను వివరించారు. అద్దం ముందు నిలబడి మనతో మనం సానుకూలంగా మాట్లాడుకోవడం, మనలోని పాజిటివ్ లక్షణాలను గుర్తించడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. లూయిస్ హే ప్రకారం మనలో ప్రతి సమస్యకు మూలం మన స్వీయ అవగాహనలోనే ఉంటుంది.“I love and accept myself exactly as I am” అద్దం ముందు ప్రతిరోజూ పునరావృతం చేయడం ద్వారా మన Affirmations మార్పులకు సిద్ధమవుతుంది. ఈ Mirror Work నెగటివ్ స్వయం భాషను తగ్గించి, సానుకూల ఆలోచనల ప్రబలతను పెంచుతుంది. ఇది మనలోని లోతైన భయాలు, ఆత్మన్యూనతా భావనను బయటకు తీసి, ప్రేమతో స్వీకరించడానికి మార్గం చూపుతుంది. లూయిస్ హే పద్ధతిని అనుసరించి అనేక మంది తమ జీవితాల్లో సానుకూల మార్పులను పొందారు.
Subconscious Conditioning
మనSubconscious Mind అనేది నెగటివ్ విశ్వాసాలు, అనుభవాలు, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఇవి మనకు తెలియకుండానే మన ఆచరణలను, భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. ఈ Conditioning వల్లనేAutomatic Negative Thoughts (ANTs) పుట్టుకొస్తాయి. ”నేను సరైన మనిషిని కాదు,” ”నేను ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటాను” వంటి ఆలోచనలు మన సత్తాను తగ్గిస్తాయి. ఈ Conditioningను సానుకూలంగా మార్చుకోవడానికి కొంత సమయం పడుతుంది.Positive Affirmations, Visualization, Gratitude వంటి సాధనాలుSubconscious Conditioningను పున:ఆకృతం చేయడంలో కీలకంగా ఉంటాయి.
Cognitive Distortions- మన ఆలోచనా విధానంలో అవాంతరాలు
Cognitive Distortions అనేవి మన ఆలోచనల్లో జరిగే తప్పులు. ఇవి మన సమస్యలను, జీవిత పరిస్థితులను అధికంగా కష్టతరంగా చూపిస్తాయి. కొన్ని సాధారణ Cognitive Distortions
1. All-or-Nothing Thinking: ”ఏదైనా పూర్తిగా పర్ఫెక్ట్‌గా లేకపోతే అది విఫలం” అని భావించడం.
2. Overgeneralization: ఒక తప్పిదం జరిగినపుడు ”ఇప్పుడంతా ఇలాగే జరుగుతుందా?” అని అనుకోవడం.
3. జa్aర్‌తీశీజూష్ట్రఱఓఱఅస్త్ర: చిన్న సమస్యను పెద్ద ప్రమాదంగా ఊహించడం.
Automatic Negative Thoughts (ANTs) – మానసిక ఆందోళనలకు మూలం
ANTs అనేవి అవగాహన లేకుండా మనలో పుట్టుకొచ్చే నెగటివ్ ఆలోచనలు. ఇవి మన శక్తిని తగ్గించడమే కాకుండా, మన వ్యక్తిత్వాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఒకసారి విఫలమైతే, ”నేను ఎప్పుడూ విజయవంతం కాలేను” అనే ఆలోచన వెంటనే ఉద్భవిస్తుంది. ఈ ఆలోచనలను గుర్తించడం మొదటి దశ. ఆ తర్వాత వాటిని సవాలు చేయడం, పాజిటివ్ ఆలోచనలతో వాటిని బదులిండడం అవసరం. దీని వల్ల మన ఆత్మవిశ్వాసం క్రమంగా మెరుగుపడుతుంది.
Journaling – ఆలోచనల అద్దం
Journaling అనేది మన ఆలోచనలను రికార్డు చేసుకునే సమర్థమైన పద్ధతి. ఇది మన లోతైన భావాలను, ఆలోచనలను వెలుగులోకి తీసుకొచ్చే ఒక కాగితం అద్దంలా పనిచేస్తుంది. మన అనుభవాలు, సమస్యలు, భావోద్వేగాలను రాసుకోవడం ద్వారా మనకు తెలియకుండానే మనలో నెగ్గి వచ్చిన నెగటివ్ థాట్ ప్యాటర్న్స్ అవగాహనకు వస్తాయి. Journaling మరింత లోతైన స్వీయ పరిశీలనకు దారితీస్తుంది. నిత్యం రాసుకోవడం ద్వారా రిపిటేటివ్, మనకు ఉపయోగపడని ఆలోచనల గుర్తింపునకు సాధ్యపడుతుంది. ఈ ఆలోచనలను పాజిటివ్‌గా మార్చడం, వాటిపై సరైన చర్యలు తీసుకోవడం ఈ ప్రక్రియ ద్వారా సాధ్యమవుతుంది.
Negative ThoughtsqT Positive Affirmationsతో మార్చడం
నెగటివ్ ఆలోచనలను పూర్తిగా తొలగించడం అనేది కాస్త కష్టమే. కానీ వాటిని పాజిటివ్ ఆలోచనలతో స్వాపింగ్ చేయడం సాధ్యమే. ఉదాహరణకు:
Negative Though: నేను విఫలుడినే.
Positive Affirmation:: విజయం సాధించడానికి నేను కావాల్సిన శక్తిని, కృషిని కలిగి ఉన్నాను.
ప్రతిసారీ నెగటివ్ ఆలోచన వస్తే, దానిని పాజిటివ్ భావనతో మార్చడం క్రమంగా Subconscious Mindను పున:ప్రోగ్రామ్ చేస్తుంది. ఈ విధానం మన ఆత్మవిశ్వాసాన్ని పెం చి, జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది.
స్వయం భాషను పాజిటివ్‌గా మార్చడం
మనలోని స్వయం భాషను పాజిటివ్‌గా మార్చడం అనేది ఒక ప్రయాణం. ప్రతిరోజూ సానుకూలంగా మనతో మాట్లాడడం, మన ఆలోచనలను రికార్డు చేయడం, వాటిని పున:ప్రతిష్టించడం ద్వారా మన జీవితానికి కొత్త దారులు తెరవవచ్చు. ‘యథా దృష్టి, తథా సృష్టి’ అనే సూత్రం ప్రకారం, మన ఆలోచనలు మన జీవిత పరిస్థితులను తీర్చిదిద్దుతాయి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం సానుకూలంగా మారుతుంది. మీ ఆలోచనలు మీ భవిష్యత్తుకు పునాది.
Wishing you all a happier and
healthier life as always
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314