రక్షణ పాఠాలు నేర్పిద్దాం…

Let's teach safety lessons...ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు ఆత్మరక్షణపై అవగాహన కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైంది. సమాజం ఆడబిడ్డలకు శత్రువులుగా మారినట్టు కనిపిస్తున్న సందర్భంలో, వారికి అవసరమైన రక్షణ పాఠాలను నేర్పించడం ప్రతి వ్యక్తి బాధ్యత.
జీవితాన్ని ప్రతిక్షణం పోరాటంగా భావించి, ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడమే అసలు విజయమని ఆడ బిడ్డలకు తెలియజేయాలి. చదువు అనేది వారి భవిష్యత్తుకు ఓ మెట్టు మాత్రమే కానీ, ఆత్మరక్షణ అంటే జీవనాధారమైన చావు-బతుకుల ప్రశ్న. కర్రసాము, కత్తిసాము వంటి కళలను నేర్చుకోవడం వారి జీవితాన్ని సురక్షితంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
పరిస్థితులపై అవగాహన
ప్రతి ఆడపిల్ల దారి పొడవునా ఎదురయ్యే ప్రమాదాలను ముందే గ్రహించే అలవాటు చేసుకోవాలి. పూలను చూస్తూ మైమరచిపోకూడదు, మబ్బులను చూస్తూ తేలిపోకూడదు, పక్షులను చూస్తూ కలల ప్రపంచంలోకి ఎగిరిపోకూడదు. దారిలో ముళ్లు, విషసర్పాలు, కౄరమగాలు ఉంటాయి. ఇవన్నీ భౌతిక ముప్పులే కాదు, కానీ ప్రాణానికి ప్రమాదకరమైన వాటిని గుర్తించి, ఎలా తట్టుకోవాలో నేర్చుకోవాలి.
సామాజిక ముప్పులపై అవగాహన
మనిషిలోని ఈర్ష్య, అసూయ, అక్కసులు అతనిని మగంలా మార్చేస్తున్నాయి. అందుకే, ప్రతి ఆడపిల్ల చుట్టూ ఉన్న వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతిదీ మంచి గా కనబడుతుందనుకోకుండా, అది ముప్పు కాగలదని ముందే గ్రహించాలి.
ఆత్మరక్షణ కళలు
ఆడపిల్లలకు బలాన్ని, ధైర్యాన్ని కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. అవసరమైతే శిక్షణ పొందిన సమురాయిలా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలి. శత్రువులను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆత్మరక్షణ కళలు ప్రతి ఆడపిల్లకు విద్యావంతంగా తయారవడంలో ఒక భాగంగా మారాలి.
మానసిక ధైర్యం
ముఖ్యంగా, ఆడపిల్లలకు మానసిక ధైర్యం అత్యవసరం. సాటి మనిషి చూపే కరుణ లేకుండా సమాజం ఉన్నప్పటికీ, తాము తమ జీవితాలను ఎలా రక్షించుకోవాలో నేర్చుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని అధిగమించడానికి మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి.
మార్పు కోసం ముందడుగు
ప్రస్తుత పరిస్థితులను మార్చడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే, ఆడబిడ్డలే ముందుకు వచ్చి మార్పు కోసం ప్రేరణగా నిలవాలి. ఆత్మరక్షణ పాఠాలు మాత్రమే కాదు, మానవతా విలువల పునరుద్ధరణ కోసం పని చేయాల్సిన అవసరం ఉంది.
సంస్కారంతో దఢత్వం
ఆడపిల్లలు సంస్కారం, మర్యాదలతో పాటు బలాన్ని కూడా తమ వ్యక్తిత్వంలో భాగంగా కలుపుకోవాలి. మగవారిపై ఆధారపడకుండా స్వతంత్రంగా నిలబడి, తమ భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలి.
ఆడపిల్ల అంటే కేవలం బలహీనతకు ప్రతీక కాదు; వారు సాహసానికి, దఢసంకల్పానికి చిహ్నం కావాలి. జాగ్రత్తగా జీవిస్తూ, ధైర్యంగా ప్రతి సమస్యను ఎదుర్కొని తమను తాము రక్షించుకోవడమే ఈనాటి అవసరం.
డా. హిప్నో పద్మా కమలాకర్‌