మిక్సీని ఇలా వాడుదాం…

Let's use mixi like this...ఉదయం చట్నీ చేయటం మొదలు… గ్రేవీ మసాలా వరకూ ప్రతి ఒక్క అవసరానికి మిక్సీని వాడతాం. మిక్సీ లేనిదే పని అవ్వదనే పరిస్థితి వచ్చింది. మరి అలాంటి వస్తువుని జాగ్రత్తగా వాడాలంటే ఏమేం టిప్స్‌ పాలో అవ్వాలో చూద్దాం.
మెల్లిగా..
మిక్సీ వాడేటప్పుడు ఒకేసారి దాని స్పీడ్‌ పెంచొద్దు. ఫస్ట్‌ మోడ్‌లో పెట్టి కాసేపయ్యాక సెకండ్‌ మోడ్‌లోకి వెళ్ళాలి. మరీ అవసరం అనుకుంటే లాస్ట్‌ మోడ్‌ వరకూ వెళ్ళండి.
రెగ్యులర్‌గా క్లీనింగ్‌..
రెండు వారాలకొకసారైనా సబ్బునీటితో క్లీన్‌ చేయాలి. టూత్‌ బ్రష్‌తో కింద భాగంలోనూ శుభ్రం చేసుకోవాలి. క్లీన్‌ చేసేటప్పుడు తడి లేకుండా చూసుకోండి.
జార్స్‌ పెట్టేటప్పుడు..
అదే విధంగా జార్స్‌ ఎలా పడితే అలా పెట్టి మిక్సీ ఆన్‌ చేయొద్దు.. జార్‌ పూర్తిగా సెట్‌ అయ్యాకనే మిక్సీ ఆన్‌ చేయాలి. అదే విధంగా, ఏవైనా మిక్సీ పట్టాక అందులో వాటర్‌ వేసి మిక్సీ చేయండి. పొడులని మిక్సీ చేసేటప్పుడు దాన్ని ఆపి ఆపి పొడి చేసుకోవటం మంచిది.
సగం పరిమాణంలో..
జార్‌ను పూర్తిగా నింపేయొద్దు. దీని వల్ల మిక్సీ త్వరగా పాడవుతుంది. పదార్థాలు కూడా మెత్తగా అవ్వవు. అందుకే, ఓవర్‌లోడ్‌ వద్దు. దీంతో పాటు మిక్సీ రన్‌ అవుతుండగా మూత తీసి చూడడం వంటివి చేయొద్దు.