కారు గుర్తుకు ఓటేసి సతీష్ అన్న గెలిపిద్దాం

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: వంగ రామయ్య పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించుకుందామని గురువారం సర్పంచ్ వంగవిజయలక్ష్మి ఇంటింటి ప్రచారం చేపట్టారు. గ్రామానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేసిన అభివృద్ధి పనులతో పాటు బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ను ప్రజలకు అందించారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ గెలిపిస్తే జరగబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.