నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరిచిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ని గెలిపించాలని కోరుతూ యాదాద్రిభువనగిరి జిల్లా ఉపాధ్యాయ సంఘాల సంయుక్త జిల్లా స్థాయి సమావేశము భువనగిరి లో నిర్వహించారు. ఈ సమావేశములో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యా దయ్యములు, టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్. సతీష్ కుమార్లు మాట్లాడుతూ విద్యారంగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కావాలంటే నిజాయితి పరుడైనా, పోరాట పటిమ, ఉపాధ్యాయ, విద్యారంగ అంశాలపై మంచి అవగాహనా కలిగిన అలుగుబెల్లి నర్సిరెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు, ఈ సమావేశము టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం. వెంకట్ రెడ్డి, రాష్ట్ర సభ్యులు మిర్యాల దామోదర్, జిల్లా కోశాధికారి బొమ్మగాని ముత్యాలు, టాప్రా నాయకులు డి. బుచ్చి రెడ్డి,జిల్లా కార్యదర్సులు పి. వెంకట్ రెడ్డి, మేరీ, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు ఎం. రామకృష్ణరెడ్డి, జిల్లా నాయకులు లింగయ్య,మజీద్ బాబా, ఎస్. పరమేశం, ఎం. అంజయ్య, జి.ప్రభాకర్, అనిత, ఎస్. ఎల్లయ్య పాల్గొన్నారు.