గెలిపించండి అభివృద్ధి చేస్తాం: జీవన్ రెడ్డి

charset=InvalidCharsetId 6

నవతెలంగాణ – మాక్లూర్

రాష్ర్టంలో కాంగ్రెస్సే ఉందని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ పక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కృషి చేయాలనీ, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తే అనేక అభివృద్ధి చేసుకోవచ్చని తెలియజేశారు. నేను రైతు బిడ్డను రైతుల కష్టాలు నాకు తెలుసని, రైతుల కోసం కృషి చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ  మండలానికి కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి జరిగిందని, మళ్ళీ ఇప్పటి వరకు మండలాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోలేదన్నారు. ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థికి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని, అభివృద్ధి చేసుకోవాలని కోరారు. తహెర్ బిన్ మాట్లాడుతూ బూత్ ల వారీగా విధులు నిర్వహించి జీవన్ రెడ్డిని అధిక మేజర్తితో గెలిపించుకోవాలని అన్నారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కృషి చేసి ఓటు వేయించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డినీ గెలిపించుకోవాలని, గతంలో ఆర్మూర్ నియోజక వర్గం నుంచి 32 వేల ఓట్లు వేసి గెలిపించుకున్న ఎంపి అరవింద్ ఒక్క సారి కూడా మాక్లూర్ మండలానికి రాలేదని అన్నారు. ఒక్క ఇంటికి ముగ్గు పోసింది లేదన్నారు. ప్రస్తుతం పక్రమెంట్ ఎన్నికలు అవగానే గ్రామాల్లో స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం ద్వారా ముగ్గు పోసుకుందమన్నారు. బీడీ కార్మికులకు కూడా అర్హులకు అందించుకుందమని తెలిపారు.  అరవింద్ మీద పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల విద్యుత్, మనం ఇచ్చే పథకాలను ప్రజలకు తీసుక వెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఈ మూడు వారాలు చాలా కీలకం, ఎవ్వరూ కూడా అలసిపోకుండా ప్రతి ఒక్కరి వద్దకు వెళ్ళి ఓటు వేయించాలని కోరారు. ఇప్పుడు కష్టపడితే తరువాత మీరే సర్పంచులు, ఎంపిటిసిలు, ఎంపిపి అవుతారని తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి – జీవన్ రెడ్డి నీ గెలిపించుకునే ముఖ్యమంత్రితో, జీవన్ రెడ్డితో మేము ఉన్నాము. అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని అన్నారు. 40 సంవతారలు అనుభవం ఉన్న వ్యక్తిని పార్లమెంట్ కు పంపితే మన సమస్యలను కేంద్రంలో మాట్లాడి మన ప్రాంత అబివృద్దికి కృషి చేస్తారని అన్నారు. మాపై నమ్మకంతో జీవన్ రెడ్డిని గెలిపిస్తే, అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తామన్నారు.
  ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మరచంద్ర మోహన్ రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ తాహెర్ బిన్ హుందన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గ ఇంఛార్జి పి. వినయ్ కుమార్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డేగ పోషేట్టి, పంచాయతీ సంఘటన అధ్యక్షులు గంగాధర్ గౌడ్, సొసైటీ చైర్మన్ బుర్రోల్ల అశోక్, ఎంపిటిసి గొవురీ ఓడ్డేన్న, పురుషోత్తం రావు, మండల అధ్యక్షులు రవి ప్రకాష్, సొసైటీ మాజీ చైర్మన్ దయాకర్ రావు, లింగ రావు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.