ఎంపీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకుందాం: గువ్వల బాలరాజు 

నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ ఎంపీగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకుందామని బిఆర్ఎస్ పార్టీ  జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు  గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం  పట్టణంలో  నియోజకవర్గ స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్  పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. వలస వాదిని అయిన మల్లురవి నీ తరిమి కొడదామని, నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ వంద రోజులు పూర్తి అయిన రుణమాఫీ చేయలేదని,  ఇది పేదల కాంగ్రెస్ పార్టీ కాదని, రైతులను మోసం చేసే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారం పొంది,  ప్రజలకు, రైతులకు, పేదలకు  న్యాయం చేయడం లేదన్నారు.  బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి బనాయిస్తే విషయం తెలిసిన మరుక్షణమే పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతామని నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  హెచ్చరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని గెలిపించాలని  అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు , మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, తదితరులు ఉన్నారు.