నవతెలంగాణ-జన్నారం
మాజీ కేంద్రమంత్రి శివశంకర్ ఆశయ సాధనకు కృషి చేద్దామని బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు లెక్కల మల్లయ్య అన్నారు. శివ శంకర్ 95వ జయంతిని పురస్కరించుకొని శనివారం మండల కేంద్రంలో బీసీ సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులస్తులకు చట్టపరంగా రిజర్వేషన్లు పెంచేలా మాజీ కేంద్రమంత్రి శివశంకర్ కృషి చేశారని, శివశంకర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. 1953 నుండి బీసీ రిజర్వేషన్ల విషయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డితో తలపడీ లక్షెట్టిపేట నియోజకవర్గం శాసనసభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి జేవీ నర్సింగరావు సహకారంతో రిజర్వేషన్లు సాధించడం శివశంకర్‌కే సాధ్యమైంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య. కోకన్వీనర్ కడార్ల నరసయ్య, మంచిర్యాల జిల్లా బీసీ కేయూపీఎస్ కన్వీనర్ ఆడెపు లక్ష్మీనారాయణ, కోకన్వీనర్ బాలసాని శ్రీనివాస్‌గౌడ్, జన్నారం మండల గౌడ సంఘం అధ్యక్షుడు మూల భాస్కర్‌గౌడ్, జన్నారం మండల మాజీ ఎంపీపీ చెట్పల్లి సత్యం, కోకన్వీనర్ మామిడి విజరు , బీసీ యువ నాయకుడు దాసరి శ్రీనివాస్, ఒల్లాల నర్సగౌడ్, కొండపల్లి మహేష్ పాల్గొన్నారు.