బాలబాలికల హాస్టల్ నిర్మాణానికి కృషి చేద్దాం: బొప్ప దేవయ్య

నవతెలంగాణ – సిరిసిల్ల
మున్నూరు కాపు బాల బాలికల హాస్టల్ నిర్మాణానికి కృషి చేద్దామని మున్నూరు కాపు లు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని  మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య పిలుపునిచ్చారు. సిరిసిల్ల సాయినగర్ లోని  మున్నూరు కాపు సంఘం పంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య  అద్యక్షతన బుధవారం  జిల్లా నూతన పాలకవర్గ సమావేశం  జరిగింది,ఈ సమావేశంలో  జిల్లా మున్నూరు కాపు సంఘం కొరకు ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల భూమిని ప్రొసీడింగ్ ప్రకారం  ప్రభుత్వ సర్వేయర్ తో  హాద్దులు ఏర్పాటు చేయించాలని తీర్మానం చేశారు. ఆదే విధంగా  మున్నూరు కాపు  మండల గ్రామ కమిటీ లు  మండల యూత్ కమిటీ ల అద్యక్ష ప్రదాన కార్యదర్శుల ను ఎన్నుకొని  జూలై మాసం లో జిల్లా కమిటీ మీటింగ్ లోగా  లిస్ట్ ను అందజేయాలని  తీర్మానించారు,ఆయా గ్రామాలలో మున్నూరు కాపు సంఘ నూతన భవన నిర్మాణాల గురించి  ప్రతిపాదనలతో పాటు పెండింగ్లో ఉన్న భవనాల పూర్తి వివరాలను అదేవిధంగా మున్నూరు కాపు కులానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల పూర్తి వివరాలను గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలకు అందజేయాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్నూరు కాపులు జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా ఎదగాలని అందుకు మున్నూరు కాపులు ఐక్యత చాటాలని అదేవిధంగా ఆర్థికంగా బలపడాలని జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పోనీశెట్టి శంకర్ మాట్లాడుతూ  మున్నూరు కాపు లు ఇతర కులాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కులస్తులు ఆర్థికంగా ఎదగాలని కోరారు. కులానికి చెందిన వలస కార్మికులు గల్ఫ్ దేశాల్లో ప్రమాదవచత్తు మరణిస్తే వారి  మృతదేహాలను తెప్పించడానికి  కుటుంబాలకు జిల్లా సంఘం  సహాయ సహకారాలు అందించడానికి అండగా ఉంటుందన్నారు, జిల్లాలో కులానికి చెందిన నిరుపేదలు ప్రమాదవశాత్తు ఎవరైనా  మరణిస్తే ఆ కుటుంబాలను జిల్లా కమిటీ పరామర్శించి  భరోసా కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని అందుకు ఆర్థిక నిధి ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది  ఈ సమావేశంలో జిల్లా నూతన పాలకవర్గ సభ్యులు కార్యవర్గ సభ్యులు  పాల్గొన్నారు.