– ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్‌కు సీఎం సమాధానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకుంటూ, కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ట్వీట్‌కు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ యువతకు సంబంధించిన సమస్యని ప్రజా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలనే ఆయన ప్రయత్నానికి ధన్యవాదాలు తెలిపారు. ”గడిచిన పదేండ్లలో తెలంగాణ యువత ఎంత దగాప డిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం.
ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగ మించాలనీ, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో మా ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తుంది” అని తెలిపారు. గురుకుల టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆర్‌ఎస్ ప్రవీ ణ్‌కుమార్ లేవనెత్తిన విషయాలు, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరిం చాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని తెలిపారు.’మా ప్రయత్నం.. మా తాపత్రయం అంతా.. తెలంగాణ ప్రజల మంచి కోసమే తప్ప, గుర్తింపు కోసం కాదని మీకు సవినయంగా మనవి చేస్తూ, మీరు మున్ముందు కూడా ప్రజా సమస్యలేమైనా సరే మా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు.