నవతెలంగాణ-జనగామ/జనగామ కలెక్టరేట్
జనగామ జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వితీయ మేనేజింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని, అందరం కలిసి పని చేసి అభివృద్ది చేెద్దామని జనగామ కలెక్టర్ శివలింగయ్య అన్నారు. ఈనెల 26న నూత న మేనేజింగ్ కమిటి ఎన్నిక కావడం, ఈ రోజు మేనేజింగ్ కమిటి తొలి సమావేశం ముగిసిన అనంతరం కమిటీ సభ్యులుజిల్లా కలెక్టర్‌ను లాంఛనంగా కలిసి ప్రెసిడెం ట్‌గా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాల యం ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించాలని సూచిస్తూ తన వంతు సహకా రం అందిస్తానని హామీ ఇచ్చారు. ఛైర్మెన్ డా. డి.లవకుమార్ రెడ్డి, వైస్ చైర్మన్ పి. గోపయ్య, కార్యదర్శి కన్న పరశురాములు, కోశాధికారి కుర్రెంల యాదగిరి, స్టేట్ ఎంసి మెంబర్ మహమ్మద్ గౌస్ మోహియుద్దీన్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సి. ఉపేందర్ రెడ్డి, డా. పి.సత్యం, పి.ప్రభాకర్, క్రిష్ణ జీవన్ బజాజ్, గాదె క్యాథరిన్, బి.రజినీ తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
31యూనిట్ల రక్తదానం సేకరణ…
జిల్లా ఆసుపత్రి, ఎంసిహెచ్ ఆసుపత్రులలో రక్తం అవసరం అనివార్యమైన పరిస్థితిలో ఉందని అధికారులు కోరిన మేరకు ఈ రోజు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన తొలి శిబిరంలో 31 యూనిట్ల రక్త దానం సేకరించారు. తొ లుత కమిటీ సభ్యులు కుర్రేముల యాదగిరి, క్రిష్ణ జీవన్ బజాజ్, లయన్ శ్యామ్ సుందర్‌లు రక్తదానంతో ప్రారంభమైన ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సుపత్రి సూపరింటెండెంట్ డా. పి.సుగునాకర్ రాజు మాట్లాడుతూ జిల్లాలో అవ సరానికి తగిన రక్తంసేకరణలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సహకరించాలని కోరా రు. బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డా. ఎస్.రామనర్శయ్యతో కలిసి రక్త దాతలకు ధృవ పత్రాలు ప్రధానం చేశారు. రక్తదానం చేసిన మహిళలు ఏర్రగొల్లపహడ్ గ్రామాని కి చెందిన విజయశ్రీ, ఉపాధ్యాయురాలు కె.సునందల సేవానిరతిని రెడ్‌క్రాస్ చై ర్మన్ డా. లవకుమార్ రెడ్డి కొనియాడారు. ఇకనుండి ప్రతినెల ఒక రక్తదాన శిబిరం నిర్వహించుటకు రెడ్ క్రాస్ సొసైటీ జనగామ జిల్లా శాఖ మేనేజ్మెంట్ కమిటి సమా వేశంలో నిర్ణయించారు. ఉదయం చైర్మెన్ డా. లవకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసున్నారు. త్వరలో యువకుల సమ్మేళనం నిర్వ హించి గుండె పోటు నరికట్టే సిపిఆర్‌ఐ కార్యక్రమం నిర్వహించాలని, తొలి త్రైమా సికంలో కనీసం 300 మంది సభ్యులను చేర్పించాలని, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డా.యస్.రాంనర్శయ్యను కార్యవర్గంలో సభ్యునిగా తీసుకొని వారి సేవలను పొం దుటకు నిర్ణయాలు గైకొన్నట్లు సొసైటీ చైర్మెన్ డా.లవకుమార్‌రెడ్డి తెలిపారు.