– ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి లిజన్మదిన వేడుకలు
– రాష్ట్ర మైనారిటీ సెల్ కన్వీనర్ రియాజ్
నవతెలంగాణ-పెద్దేముల్
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దామని రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాల్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోదరుడు ఆర్బిఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని తట్టేపల్లి సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం ఆధ్వర్యంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డి, తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, కోట్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ, మాజీ ఎంపీటీసీ డాక్టర్ రమేష్ కుమార్, పెద్దేముల్ సొసైటీ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఆర్మీ రిటైర్మెంట్ మాజీ ఎంపీటీసీ విద్యాసాగర్, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై. నర్సింలు, కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు ఎమ్మెల్యే సహకారంతో దశలవారీగా అభివద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, మండల బీసీ సంఘం సెక్రెటరీ ఆనంద్ చారి, షబ్బీర్, జైపాల్ రెడ్డి, రమేష్, మల్లప్ప, వెంకట్ రెడ్డి, మినాజ్, బాల్‌రెడ్డి, చెట్ల మీద రామప్ప పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.