ప్రజలతో మమేకమై పనిచేద్దాం

– బీజేపీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కరరెడ్డి
నవతెలంగాణ-చందానగర్‌
ప్రజాసమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా సమిష్ఠిగా కృషి చేద్దామని బీజేపీ రాష్ట్ర నాయ కులు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్‌ స్వాగత్‌ హౌటల్‌ లో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. జీహెచ్‌ఎంసీ, రెవె న్యూ కార్యాలయాలు అధికార పార్టీకి, దళారులకు అడ్డా లుగా మారాయని అన్నారు. బ్రహ్మాస్త్రంగా ఉపయోగ పడాల్సిన ఆర్టీఐని అన్ని కార్యాలయాల్లో నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో అజిత్‌ కుమార్‌ సేనాపతి, నూనె సురేందర్‌, చిలకమర్రి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ బి.వి. సత్యరమేష్‌, శ్రీమతి నం దనం వినయ, శ్రీమతి రాధామూర్తి,మేరి, వేణుగోపాల్‌ పగడాల, గూడూరి త్రినాథ్‌, డాక్టర్‌ కె.రాజేందర్‌రెడ్డి, కె.నరేష్‌కుమార్‌, కుందన్‌కుమార్‌ గుప్త, ఎడ్ల ఆంజనే యులు, డి.చందు, ఎల్‌. ప్రభాకర్‌, ఎల్‌. పాండుగౌడ్‌, చవగాని శ్రీనివాస్‌, రాజేష్‌ శెట్టి పాల్గొన్నారు.