డీజీపీ చేతుల మీదుగా అశ్వారావుపేట సీఐ కు ప్రశంసా పత్రం..

Letter of appreciation to Ashwaraopeta CI by the hands of DGP..– అభినందనలు తెలిపిన ఎస్పీ రోహిత్ రాజు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం,హైదరాబాదు లో తెలంగాణ డిజిపి డాక్టర్ జితేందర్ చేతుల మీదుగా మంగళవారం అశ్వారావుపేట సిఐ కరుణాకర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు బుధవారం బహిర్గతం చేసారు. చుంచుపల్లి సిఐ గా పని చేసే సమయంలో చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలో ఒక మహిళ హత్యకు గురైన కేసులో నేర స్థలం వద్ద లభించిన కేవలం ఒక “దిష్టిబొమ్మ” ఆధారంగా కేసును ఛేదించి నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా కృషి చేసినందుకు గాను సీఐ కరుణాకర్ కు డిజిపి జితేందర్  ప్రశంసా పత్రాన్ని అందించారు.హత్య కేసులో బహు కోణాలలో విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడే విధంగా కృషిచేసి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందిన సీఐ కరుణాకర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.