వైస్ ఛాన్సలర్ కు లేఖ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు తెలియజేయునది… ఏమనగా..తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రైవేట్ బి.ఎడ్ కళాశాలలు,  డిగ్రీ కళాశాలకి సంబంధించినటువంటి సమాచారం సమాచార హక్కు చట్టం 2005 ద్వారా పలుమార్లు అడిగితే సమాచారం థర్డ్ పార్టీకి ఇవ్వడం కుదరదని యూనివర్సిటి అధికారులు సమాచారం ఇవ్వడం లేదు.  సమాచారం ఇవ్వడంలో సెక్షన్స్ చూసి మరి నిబంధనల ప్రకారం ఇవ్వకూడదని తెలుపుతున్నారో… తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ నిబంధనలను తుంగలో తొక్కి కొన్ని బి.ఎడ్ మరియు డిగ్రీ కళాశాల్లలో  సరైనటువంటి సౌకర్యాలు లేవు, అర్హతలు గల ఫ్యాకల్టీ లేరు. యూనివర్సిటీ కట్టవలసిన అఫీలేషన్ ఫీజు కట్టకుండా ఉన్నారు , గ్రౌండ్ పార్కింగ్ లేని కళాశాలలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీలు లేవు. యూనివర్సిటీ ఫీజులు ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు తిసుకుంటున్నారు. అద్దె భవనాల్లో కళాశాలలు నడుపుతున్నారు.

అయినా కానీ వారి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ప్రతి సంవత్సరం తనిఖీలు చేసి నిబంధనలు పాటించకుండా ఉన్న కాలేజీలకు అఫిలేషన్ రెన్యువల్ ఎందుకు చేస్తున్నారు? యూనివర్సిటీ నిబంధనలు పాటించని కళాశాలపై చర్యలు తీసుకుంటారా లేదా  వేచి చూస్తాం ..
ఇట్లు పిడిఎస్ యూ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం