ఎల్‌జీ దీపావళీ ఆఫర్లు షురూ..

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ ఎల్‌జి ఇండియా దీపావళి ఆఫర్లను ముందుగానే అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఇండియా కా సెలబ్రేషన్‌’తో పేరుతో రూ.51 కోట్ల విలువ గల ప్రమోషన్‌ బహుమతులను అందించనున్నట్లు పేర్కొంది. తమ అన్ని ఉత్పత్తులపై రాయితీలు లభిస్తాయని తెలిపింది. రూ.1 డౌన్‌ పేమెంట్‌తో రూ.888 ప్రారంభమయ్యే వాయిదా చెల్లింపులు (ఇఎంఐ)లను ఎంచుకోవచ్చని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ఎండి హాంగ్‌ జు జియాన్‌ పేర్కొన్నారు.