వాటర్ ప్యూరిఫైర్స్ తొమ్మిది కొత్త మోడల్స్ శ్రేణిని విస్తరించిన LG

నవతెలంగాణ హైదరాబాద్: తొమ్మిది కొత్త మోడల్స్ విడుదలతో తమ వాటర్ ప్యూరిఫైర్స్ పోర్ట్ ఫోలియోల విస్తరణను భారతదేశపు ప్రముఖ వినియోగదారు డ్యూరబుల్స్ బ్రాండ్ LG, ఈరోజు ప్రకటించింది. వాటర్ ప్యూరిఫైర్స్ కొత్త శ్రేణి వినియోగదారుల కోసం స్వచ్ఛమైన, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన త్రాగు నీటిని నిర్థారించే ఆధునిక ఫీచర్స్ తో లభిస్తోంది.
భారతదేశపు వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చడానికి  కొత్తగా విడుదల చేయబడిన మోడల్స్ WW176GPRB, WW176GPBW, WW156RPTB, WW156RPTC, WW146RPLB, WW136RPNB, WW146RPLC, WW132NP మరియు WW131NP రూపొందించబడ్డాయి. పరిశుభ్రత, ఆరోగ్యం, డిజైన్ మరియు సౌకర్యవంపై దృష్టి కేంద్రీకరణతో, ఈ వాటర్ ప్యూరిఫైర్స్ పరిశ్రమలో కొత్త కొల ప్రమాణాన్ని ఏర్పరిచే వినూత్నమైన ఫీచర్స్ శ్రేణిని అందిస్తాయి.

LG నుండి వాటర్ ప్యూరిఫైర్స్ కొత్త శ్రేణి స్వచ్ఛమైన త్రాగు నీటిని అందిస్తుంది మరియు స్వర్గీత డాక్టర్. కేకే అగర్వాల్ స్థాపించిన ప్రముఖ జాతీయ ఆరోగ్యం సంరక్షణ NGO హార్ట్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాచే ఇవి ధృవీకరించబడ్డాయి. ఈ ప్యూరిఫైర్స్ ఆరోగ్యకరమైన త్రాగు నీరు, ఫిల్టరేషన్, నిర్వహణ, పొందుపరచడాన్ని కలిగి ఉండే ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి.
       ఈ విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ, సంజయ్ చిత్కారా, సీనియర్, వైస్ ప్రెసిడెంట్హోమ్ అప్లైయెన్సెస్ & ఎయిర్ కండిషనర్స్ ఇలా అన్నారు, వినియోగదారుపై కేంద్రీకరించబడిన బ్రాండ్ గా,  అర్థవంతమైన   ఆవిష్కరణ ద్వారా  మా వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడంపై మేము దృష్టి కేంద్రీకరించబడింది. మా సరికొత్త వాటర్ ప్యూరిఫైర్స్ శ్రేణి ఆధునిక భారతదేశపు కిచెన్ ప్రదేశాన్ని మెరుగుపరిచే ప్రీమియం గ్లాస్ ఫినిష్ తో అందంగా రూపొందించబడింది. కొత్త శ్రేణి స్వచ్ఛమైన త్రాగు నీటిని కేటాయిస్తుందిమా వినియోగదారుల ఆరోగ్యం మరియు పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది. కొత్త మోడల్స్ మా మార్కెట్ స్థానాన్ని మరింత శక్తివంతం చేస్తాయని మరియు మా కస్టమర్ల కోసం ఆరోగ్యకరమైన జీవన శైలికి తోడ్పడతాయని మేము ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాము.”

 కొత్త మోడల్స్ యొక్క కీలకమైన ఫీచర్లు:

  1. ఎయిర్ టైట్ స్టైయిన్ లెస్ స్టీల్ (SS 304 గ్రేడ్) 8-లీటర్ వాటర్ ట్యాంక్: ద్వంద్వ రక్షణ సీల్ తో కూడిన ఈ ట్యాంక్ నీటి తాజాదనం నిర్వహిస్తుంది మరియు క్రిములు మరియు దుమ్ము వంటి బయటి మాలిన్యాలను నియంత్రించడం ద్వారా రెండవ రకం కలుషితాన్ని నివారిస్తుంది. ఇది బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది, దుర్వాసనలు, నాచు మరియు పసుపు రంగు మచ్చలను నివారిస్తుంది.
  2. మినరల్ బూస్టర్: కాల్షియం మరియు మెగ్నీషియం వంటి అవసరమైన మినరల్స్ ను చేర్చడం ద్వారా నీటి రుచిని మరియు ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది. ఈ ఫీచర్ శుద్ధి చేయబడిన నీటిని కేవలం సురక్షితంగా ఉంచడమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ప్రయోజనకరంగా నిర్థారిస్తుంది, వినియోగదారుల పూర్తి సంక్షేమానికి తోడ్పడుతుంది.
  3. ఇన్ట్యాంక్ ఎవ్వర్ ఫ్రెష్ UV ప్లస్: బ్యాక్టీరియాను డీయాక్టివేట్ చేయడానికి మరియు నిల్వ చేసిన నీటి యొక్క తాజాదనం మళ్లీ శక్తివంతం చేయడానికి మరింత సమర్థవంతమైన UV LEDని వినియోగిస్తుంది. ఆధునిక UV LED టెక్నాలజీ నిరంతర డిస్ ఇన్ఫెక్షన్ ను నిర్థారిస్తుంది, భద్రతకు చేర్చబడిన అదనపు పొరను కేటాయిస్తుంది మరియు నీళ్లు పొడిగించబడిన సమయాల కోసం స్వచ్ఛంగా మరియు తాజాగా ఉండటాన్ని నిర్థారిస్తుంది.
  4. డిజిటల్ స్టెరిలైజింగ్ సంరక్షణ: హానికరమైన రసాయనాలు లేకుండా గొట్టాలు, ఫాసెట్స్ మరియు పైప్స్ సహా నీటి మార్గాలను శుభ్రం చేస్తుంది మరియు శానిటైజ్ చేస్తుంది. ఈ వినూత్నమైన ఫీచర్ వాటర్ ప్యూరిఫైర్ యొక్క ప్రతి భాగం పరిశుభ్రంగా ఉందని నిర్థారిస్తుంది, అన్ని వేళలా సురక్షితమైన త్రాగు నీటిని కేటాయిస్తుంది.
  5. బహుళ దశల ఫిల్టరేషన్: సమగ్రమైన 7 దశల ఫిల్టరేషన్ ప్రక్రియలో బయటి సెడిమెంట్, యాంటీస్కాలెంట్ ఫిల్టర్, కాంపోజిట్ సెడిమెంట్, కార్బన్ ఫిల్టర్, RO మెంబ్రేన్ ఫిల్టర్, మినరల్ బూస్టర్, పోస్ట్కార్బన్ ఫిల్టర్ లు భాగంగా ఉన్నాయి. ఈ బహుళపొరల విధానం వివిధ కలుషితాలను తొలగించడాన్ని నిర్థారిస్తుంది, ఇది నీటిని సురక్షితం చేయడమే కాకుండా దాని రుచి మరియు నాణ్యతను కూడా పెంచుతుంది.
  6. కాంటాక్ట్ లెస్ నిర్వహణ: నిర్వహణ ప్యాకేజీ, రూ. 4200 విలువ గలది, దీనిలో మొదటి సంవత్సరంలో  మూడు ఉచిత షెడ్యూల్ చేయబడిన మరియు ఆటోమేటెడ్ సందర్శనలు, మూడు ఉచిత డిజిటల్ స్టెరిలైజింగ్ సంరక్షణ సమావేశాలు, మరియు మూడు ఉచిత బయటి సెడిమెంట్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫీచర్ సౌకర్యం మరియు నిర్వహణ సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తుంది, ప్యూరిఫైర్ నిర్వహణ గురించి విచారించకుండా శుభ్రమైన నీటిని నిరంతరంగా పొందే ఆనందానికి యూజర్లకు అనుమతి ఇస్తుంది.
  7. స్టైలిష్ డిజైన్ తో ఆధునిక UF ఫిల్టరేషన్: వాటర్ ప్యూరిఫైర్ ఆధునిక UF ఫిల్టరేషన్ వ్యవస్థను కలిగి ఉంది, పండ్లు మరియు కూరగాయలను శుభ్రం చేయడానికి పరిపూర్ణమైనది.
    LG వాటర్ ప్యూరిఫైర్స్ 2024 శ్రేణి ప్రీమియం బ్లాక్ సహా, ప్లెయిన్, లీఫ్, లోటస్ మరియు గ్లాస్ రీగల్ నమూనాలు, లీఫ్ మరియు లోటస్ నమూనాలతో  క్రిమ్సన్ రెడ్, మరియు రెండురంగుల నమూనాతో గ్లాస్ ఫినిష్ తో లభిస్తోంది. ప్రామాణికమైన LG ఉత్పత్తుల యొక్క  గుర్తింపును నిర్థారించడానికి అది బార్ కోడెడ్ ఫిల్టర్స్ ను చేర్చింది.

     ఈ కొత్త శ్రేణి ఆధునిక టెక్నాలజీ మరియు యూజర్కేంద్రీకృత ఫీచర్ల మిశ్రమానికి ప్రాతినిధ్యంవహిస్తుంది, వాటర్ ప్యూరిఫికేషన్ యొక్క ఉన్నతమైన ప్రమాణాలను తీర్చడానికి రూపొందించబడింది. ఆరోగ్యం, సౌకర్యం మరియు వినూత్నతలకు ప్రాధాన్యతనిస్తూభారతదేశంవ్యాప్తంగా వినియోగదారుల కోసంఈ కొత్త మోడల్స్ వాటర్ ప్యూరిఫికేషన్ అనుభవాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉన్నాయి.

ధర మరియు లభ్యత: వాటర్ ప్యూరిఫైర్స్ కొత్త శ్రేణి రూ. 17,099 మరియు రూ. 36,999 మధ్య ధరలలో వివిధ రకాల బడ్జెట్ వర్గాల వారి కోసం లభిస్తుంది, LG వాటర్ ప్యూరిఫైర్స్ రిటైల్ మరియు LG.com సహా ఆన్ లైన్ ప్లాట్ ఫాంలలో భారతదేశం అంతటా విక్రయించబడతాయి.