తులం వెండి రూ.1000 పైనే..

న్యూఢిల్లీ : దేశంలో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. మధ్య తరగతి ప్రజలు కూడా కొనలేని స్థాయికి చేరుకున్నాయి. వరుసగా ఆరో సెషన్‌లోనూ సోమవారం పసిడి ధర ఎగిసి పడింది. గుడ్‌రిటర్న్‌ సమాచారం ప్రకారం.. ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,500 పెరిగి ధర రూ.1,01,000కి ఎగిసింది. అంటే తులం ధర రూ.1010 పలికింది. 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరిగి 79,790కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,150గా నమోదయ్యింది.