– యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేత
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని సెంట్రల్ లైబ్రరీలో కాంపిటేటివ్ బుక్స్, ఎంట్రెన్స్ న్యూ ఎడిషన్ బుక్స్, అదేవిధంగా లైబ్రరీలో ఫ్యాన్స్ లేవని, మిగిలిన సమస్యలు పరిష్కరించాలి కోరుతూ గురువారం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ ఎస్ యుఐ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షుడు కొమిర శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాంపిటేటివ్ బుక్స్, ఎంట్రెన్స్ న్యూ ఎడిషన్ బుక్స్, అదేవిధంగా లైబ్రరీలో ఫ్యాన్స్ లేవని వేంటనే ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.లైబ్రరీలో లైట్స్ కూడా సరిగ్గా లేవని వాటన్నింటినీ తక్షణమే ఏర్పాటు చేయాలని, ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో ఉన్నటువంటి రూముల్లో లైటింగ్ తక్కువగా ఉందని, అందులో కూడా లైట్స్ పేట్టించి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపాలని వారిచ్చిన వినతి పత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యుఐ ప్రధాన కార్యదర్శులు బానోత్ సాగర్ నాయక్,అల్లుర్ రాజేందర్, మహేష్ తదితరులు ఉన్నారు.