ఇన్ఫోసిస్‌తో ఎల్‌ఐసి ఒప్పందం

LIC tie up with Infosys– నూతన డిజిటల్‌ వేదిక ఏర్పాటు లక్ష్యం
ముంబయి : టెక్‌ కంపెనీ ఇన్ఫోసిస్‌తో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కాలంతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకోవడాని.. మరింత మెరుగైన డిజిటల్‌ వేదికను అందుబాటులోకి తేవాలని నిర్దేశించుకుంది. డిజిటల్‌ వినూత్నత, విలువ పరంగా డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చొరవకు నాయకత్వం వహించడానికి ఎల్‌ఐసికి సహకారం అందించనున్నట్లు ఇన్ఫోసిస్‌ పేర్కొంది. త్వరలోనే తదుపరితరం డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడాన్ని ప్రారంభిస్తుందని తెలిపింది. ఇది ఎల్‌ఐసి ఖాతాదారులు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్నిచానెల్‌ ఎంగేజ్‌మెంట్‌, డేటా ఆధారిత హైపర్‌ పర్సనలైజ్డ్‌ అనుభవాలను అందించనుంది. భారీ స్థాయి డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ప్రాజెక్ట్‌లను అమలు చేయడంలో దాని విస్తృత అనుభవం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌.. ఇన్సూరెన్స్‌ రంగాలలో మరింత నైపుణ్యం పెంచుకోవాలని ఎల్‌ఐసి భావించింది. కృత్రిమ మేధా (ఎఐ) క్లౌడ్‌ నైపుణ్యాలను ఎల్‌ఐసిలో కూడా ప్రవేశపెట్టనున్నామని ఇన్ఫోసిస్‌ సిఇఒ, ఎండి సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. ఇది ఎల్‌ఐసి అభివృద్థికి ఎంతగానో దోహదం చేయనుందన్నారు. దీంతో పాలసీదారులు, ఏజెంట్లు, ఉద్యోగులు అధునిక టెక్నాలజీ అనుభవాలను పొందనున్నారని ఎల్‌ఐసి ఎండి, సిఇఒ సిద్ధార్థ మోహంతి పేర్కొన్నారు.