పాలసీదారులకు ఎల్‌ఐసీ హెచ్చరిక

LIC warning to policyholders– మోసపూరిత యాప్స్‌పై అప్రమత్తం
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ తన ఖాతాదారులను మోసపూరిత యాప్స్‌ అంశమై అప్రమత్తం చేసింది. ఫేక్‌ యాప్స్‌ భారీన పడి మోసపోవద్దని హెచ్చరించింది. ఎల్‌ఐసీ పేరుతో మోసపూరిత మొబైల్‌ అప్లికేషన్లు చెలామణి అవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఫేక్‌ యాప్స్‌ను నమ్మితే మోసపోతారని హెచ్చరించింది. అదే విధంగా వ్యక్తిగత సమాచారం, ఆర్థిక లావాదేవీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంది. సేవల కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ లేదా డిజిటల్‌ యాప్‌ను, వెబ్‌సైట్‌లో తమ గుర్తింపు కలిగిన గేట్‌వే సంస్థలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.