బెల్ట్ షాపులకు మద్యాన్ని అమ్ముతున్న వైన్స్ షాపుల లైసెన్సులు రద్దు చేయాల

Licenses of wine shops selling liquor to belt shops should be cancelledనవతెలంగాణ – మునుగోడు
మునుగోడు మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న వైన్స్ షాపులపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మునుగోడు ఎస్సై చందా వెంకటేశ్వర్లు కి స్థానిక పోలీస్ స్టేషన్లో  వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి మాట్లాడుతూ.. మండలంలో అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు బందు చేయాలని తగిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వైన్స్ షాపు యాజమాన్యాలు బెల్ట్ షాప్ నిర్వాహకులతో కుమ్మక్కయి గ్రామాల్లో ఇంకా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వీటిని అరికట్టాలంటే బెల్టు షాపులకు మందును అమ్ముతున్న వైన్స్ షాపులను గుర్తించి వాటి లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ,అలాగే వైన్స్ షాపుల ముందు ఎలాంటి సీసీ టీవీ పర్యవేక్షణ ఉండటం లేదని, ఉన్న కూడా ఏదో నామమాత్రంగా పెట్టారని అన్నారు, పర్మిట్ రూముల్లో సీసీ కెమెరా పనిచేయడం లేదని అన్నారు. పర్మిట్ రూములు ఉదయం వేళలో ఏడు గంటల ప్రాంతంలో ఓపెన్ చేస్తున్నారని, అలాంటి వైన్స్ షాపులను గుర్తించాలని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కేంద్రంలో వైన్స్ షాప్ ల వల్ల ట్రాఫిక్ కి అంతరాయం జరుగుతుందని, పాఠశాలల దగ్గర్లో వైన్సులు నిర్వహించడం వలన విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు యాట రాజు, నాయకులు చికూరి బిక్షం, మహేష్, గిరి తదితరులు పాల్గొన్నారు.