
విత్తన సీడ్స్ యాజమానులు నకిలీ విత్తనాలు అమ్మితే.. లైసెన్సులు రద్దు చేస్తామని రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఫర్టిలైజర్స్ దుకాణంలో నిలువ ఉన్న రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం తన ఛాంబర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విక్రయిస్తే రైతులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. డివిజన్ పరిధిలో అధికంగా వరి ,వేరుశనగ, కందులు, పత్తి పత్తి పంటలను సాగు చేస్తారని, ప్రభుత్వం గుర్తించిన కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాలను వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం కొనుగోలు చేయాలని సూచించారు. వానకాలం సీజన్ లో రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి, ఎస్సై, తాసిల్దార్ ముగ్గురు నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు.