ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పై అసత్య ప్రచారాలు మానుకోవాలి

వతెలంగాణ – ఖానాపూర్
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై బీఆర్ఎస్ నాయకులు కావాల ఫోన్ చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా వీడియో క్లిప్ పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసత్య ప్రచారాలను మానుకోవాలని లంబాడ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు అజ్మీర నందు నాయక్ అన్నారు. జన్నారం ప్రెస్క్లబ్లో పత్రిక విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు చేసిన వ్యక్తిపై, అతనికి సహకరిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గుర్తించి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుపతి, కవ్వాల్ మాజీ సర్పంచ్ శేషారావు, ధర్మో నాయక్ రవి నాయక్ బన్సీలాల్ లింబా నాయక్ తదితరులు పాల్గొన్నారు..