– రెండు వేల జరిమానా
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
భర్తను దారుణంగా హత్య చేసిన భార్యకు గురువారం కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవిత కాలం శిక్షతో పాటు రూ.2 వేల రూపాయల జరిమానా విధించారు. పెద్దకొడప్ గల్ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన తడుకంటి అంజవ్వ తరచూ తన భర్త సాయిలతో డబ్బుల విషయంపై గొడవ జరగగా, అంజవ్వ తన భర్తను 10-06-22 నాడు బట్ట సహాయంతో గొంతుకు చుట్టి చంపివేసినట్లు మృతుడి సోదరుడు గంగరాం పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి బిచ్కుంద సీఐ క్రిష్ణ. పెద్దకొడప్ గల్ ఎస్ విజయ్ కొండలు,విచారణ చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు అంజవ్వనే తన భర్తను హత్యచేసి నట్లు సాక్షులను కోర్టుకు సమర్పించడంతో నేరం రుజువు అయినందున బుధవారం కామారెడ్డి జిల్లా కోర్టు న్యాయాధికారి వివిఆర్ వరప్రసాద్ నిందితురాలికి జీవిత కాల ఖైదుతో పాటు, రూ.2 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసును చేదించి నిం దితురాలికి శిక్షపడేలా కేసు విచారణ చేసిన అప్పటి బిచ్కుంద సీఐ క్రిష్ణ పెద్ద కొడప్తల్ ఎస్ఐ విజయకొండ, ప్రస్తుత పెద్దకొడప్ గల్ ఎస్ఐ మహేందర్,కోర్టు లైజనింగ్ ఆఫీసర్ మురళి,సిడివో మురళీకృష్ణ, రవి లను జిల్లా ఎస్పీ సిందూ శర్మ అభినందించారు.