నవతెలంగాణ – యాదాద్రి: కలెక్టరేట్ ప్రతి కుటుంబానికి అండగా భారతీయ జీవిత బీమా సంస్థ ఉంటుందని ఎల్ఐసి అడ్వైజర్ అబ్బ గాని వెంకట్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన యాదగిరిగుట్ట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన బండి పాండు అనారోగ్యంతో మరణించినందున వారి కుటుంబ సభ్యులు వారి భార్య బండి కలమ్మకు 75 వేల రూపాయల ఎల్ఐసి చెక్కును అందజేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాలసీదారునికి నమ్మకాన్ని కల్పిస్తూ భరోసాని ఇచ్చే భారతదేశంలో ఏకైక ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి సంస్థ అని తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్థిక సహకారనందిస్తూ పాలసీదారుడు పెట్టే పెట్టుబడికి నమ్మకాన్ని కలిగిస్తుందని తెలిపారు పాలసీదారుడు చెల్లించిన ప్రీమియానికి తన పాలసీ కాలవ్యవధి పూర్తయిన తర్వాత లాభాలతో అమౌంట్ అందజేస్తూ మరియు కుటుంబ సభ్యులు ఏ కారణం చేతనైనా మరణించిన వారి కుటుంబానికి అండగా ఉంటూ ఎల్ఐసి భరోసాను కల్పిస్తుంది అని తెలిపారు. ప్రజలందరూ కూడా వేరే ఇతర ప్రైవేటు సంస్థల జోలికి వెళ్లకుండా నమ్మకమైన ఎల్ఐసి సంస్థలో మీ యొక్క పెట్టుబడులు పెట్టాలని ప్రీమియం సరైన తేదీలలో విధిగా చెల్లించాలని కోరారు.