ప్రచారం కంటే ప్రాణమే ముఖ్యం

– యాక్సిడెంట్‌ అయి రోడ్డు పక్కన ఉన్న చిన్నారిని హాస్పిటల్‌ తరలించిన వట్టె రేణుక
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
పొట్లపాడు గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం సూర్యాపేటకు సరుకులు తీసుకొని తిరిగి వారి ఊరికి పోతుండగా పట్టణంలోని జమ్మిగడ్డలో రోడ్డుపై యాక్సిడెంట్‌ అవ్వడంతో చిన్న బాబుకు తల పగిలి రక్తంతో బాబు ఏడుస్తుండడాన్ని చూసి వెంటనే ఆ మార్గంలో వెళ్తున్న వట్టె రేణుక ప్రచారం కంటే ప్రాణమే ముఖ్యమని.. తన సొంత కారులో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అక్కడే ఉన్న జానయ్య కుమారుడు వట్టెగణేష్‌యాదవ్‌ దగ్గరుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్‌ ఇప్పించారు. అనంతరం బాబు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి వెళ్లారు.