లౌకికతత్వమే-జీవితానికి దారి ?

ఇపుడు ఈ నేలలో ప్రపంచంలో
జరుగుతున్న మతవిద్వేషాలు, ఘోరాలు మనిషిని మనిషిగా బతకనిస్తలేవు.
కవుల కలం, గాయకుల గళం,
రాయాలి, పలకాలి.
పలకరించాలి రాసింది బుద్దిని
మానవజాతికి మేల్కొల్పాలి.
కుల మత విద్వేషాలు స్వభావం కాదు.
హిందు – ముస్లీం -క్రైస్తవ – సిక్కు-
ఈ సాయి ఇవన్నీ వ్యక్తిగత విషయాలే.
ఇదో పెద్ద రాజకీయమైపోయింది ఇపుడు.
చీలికలకు కారణమైంది.
అక్షరం సెక్యులర్‌ భావాలు
నీవెంటే ఉంటే-
మనిషితనం.
చరిత్ర గాయాల్ని తుడిచేస్తుంది.
ఇది చేయలేక పోతే,
మనిషి, మనిషి కాదు.
బతుకే బతుకు కాదు.
అందరిని ఒకేలా ప్రేమించి
కలిసి నడవడమే లౌకికతత్వంబీ
లౌకికతత్వం లేకపోతే ప్రజాస్వామ్యం, కోల్పోతుంది, లేకుంటే దారితప్పుతుంది.
కుర్చీ మనిషి న్యాయస్థానాలు పాలకశాఖలు, బతుకులను ఛిద్రం చేసినవి
మనిషి, మనిషిగా, మానవునిగా,
మానవోత్తముడిగా, మహానుబావుడిగా,
ఎదుటి వారి కష్టాలను, బాదలను మార్చాలి, అది జరగాలంటే
మతం కాదు, కుర్చీకాదు.
మనిషి మనిషిగా జీవిస్తూ,
కులతత్వద్వేషాలు లేకుండా జీవించాలి.
మన జీవన సంస్కతిలో బుద్దుని బోదనలు,
మనసు పాఠాలు కావాలి.
మతం పేరుతో మానవత్వమే మరిచిపోతే,
జాతి ఆదిపత్యజాడ్యంతో
దారి తప్పతుంది.
మత సామరస్యంలేని జీవన రోగానికి,
సెక్యులరిజమే వైద్యం.
ఇప్పుడు ధనస్వామ్యం పేర
నడుస్తుంది ఇష్టారాజ్యం
రాజ్యం లౌకికరాజ్యం రావాలంటే, జీవనసంస్కతులు,
సెక్యులరిజం మమేకం కావాలి.
అప్పుడు ప్రజలు నిజమైన ప్రజలు జీవిస్తారు.
ప్రజల సమిష్టి ప్రయోజనం కోసం,
రాజ్యాంగాన్ని ”పటిష్టంగా అమలు చేయడం. లౌకిక ప్రజాస్వామ్యం, జీవనసంస్కతికి, సమానత్వానికి
బాటలు సెక్యులరిజం.
– ఎం డి.ఖాజామైనద్దీన్‌
9396626276