ప్రాణహిత పరవళ్లు

Life-saving tricks– నాటు పడవల్లో ప్రయాణం
– వరద నీటిలో మునిగిన వేలాది ఎకరాల పంట పొలాలు
– ఇబ్బందుల్లో జలదిగ్బంధం గ్రామాల ప్రజలు
నవతెలంగాణ-బెజ్జూర్‌
ప్రాణహిత నది పరవళ్ళు తొక్కుతుంది. మండలంలో ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. మహారాష్ట్రలో ఎగువన కురిసిన భారీ వర్షాలకు ప్రాణహిత నది పరవళ్ళు తొక్కుతుంది. ప్రాణహిత నది పరిసర ప్రాంతాల్లో వేసిన పత్తి పంటలు మునిగాయి. మండలంలోని మొగవెళ్ళ్లి, సోమిని, తలాయి, తికపల్లి, భీమవరం, పాపన్నపేట, పాత సోమిణి తదితర గ్రామాల్లో రైతులు వేసిన ప్రతి పంటలు ప్రాణహిత వరదల వల్ల నీట మునిగి రైతులు వేసిన పంటలు నష్టపోయారు. ప్రాణహిత వరదల వల్ల మండలంలోని తలాయి, తిక్క పల్లి భీమారం గ్రామాలు జలదిగ్బంధంలో మూడు రోజులుగా ఉన్నాయి. ఈ గ్రామాలకు ప్రజలు వెళ్లాలంటే నాటుపడవల్లో ప్రయాణించక తప్పడం లేదు. సోమవారం తలాయి గ్రామంలో నుండి పాపన్‌ పేట వరకు 8కిలో మీటర్లు బెజ్జూరుకు వచ్చేందుకు నాటు పడవల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ప్రమాదకరంగా నాటు పడవల్లో ప్రయాణించి నిత్యవసర వస్తువులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. జలదిబ్బంధంలోని గ్రామాల్లో కరెంటు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాక్‌ వాటర్‌తో మండల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.