సాంకేతిక లోపంతో నిలిచిపోయిన అపార్ట్మెంట్లోని లిఫ్ట్ 

– లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయిన ఐదుగురు చిన్నారులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సాంకేతిక లోపంతో అపార్ట్మెంట్లోని లిఫ్టు నిలిచిపోగా అందులో ఐదుగురు చిన్నారులు ఇరుక్కుపోయిన ఘటన గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో ఆర్మూర్ రోడ్ లో గల సాయి ప్రియ నగర్ ప్రాంతంలో సాయి అత్కారి అపార్ట్మెంట్ లో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన గురువారం రాత్రి  సాయి అత్కారి అపార్ట్మెంట్లోని వివిధ ప్లాట్లలో ఉండే చిన్నారులు విరాజిత్, విహాన్, దన్వీ, అద్వైత్, విక్షిత్ లు లిప్టులో వెళుతుండగా సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. దానితో చిన్నారుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్నారులు లిఫ్టులు ఇరుక్కుపోవడంతో అపార్ట్మెంట్లో అలజడి నెలకొంది. సంబంధిత బిల్డర్ కు ఫోన్ చేసిన స్పందించలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. చివరకు మెకానిక్ ను రప్పించి లిఫ్ట్ ను తెరిచి పిల్లలను క్షేమంగా కాపాడారు. బిల్డర్ నాసిరకపు పనుల కారణంగానే తమకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. పిల్లలు క్షేమంగా లిఫ్ట్ నుంచి బయటకు రావడంతో తల్లిదండ్రుల ముఖాములో ఆనందం కనిపించింది. కానీ అపార్ట్మెంట్లో ఉంటున్న వారందరూ అలాగే ప్రస్తుతం అపార్ట్మెంట్లో లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ బిల్డర్ నాసిరకపు పనులు చేపట్టడం వలన ఇలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.