
– నెరవేరనున్న రైతుల ఆశలు
– కుంకుడు తండాచెట్టు తండా లిఫ్టకు త్వరలో నీటి విడుదలకు ఏర్పాట్లు
నవతెలంగాణ – పెద్దవూర
రూ 2.47కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన కుంకుడు చెట్టు లిప్ట్ కు నీటివిడుదలకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏఎమ్ఆర్ పి లోలేవల్ వరద కాలువ 8,9 డిస్ట్రిబ్యూటరీ కాలువ ద్వారా కుంకుడు చెట్టు లిఫ్టు ఏర్పాటు చేశారు. దీని పరిధిలో పెద్దవూర మండలం లోని కుంకుడు చెట్టు తండా, చలకుర్తి, బెట్టెల తండా నేరటోని గూడెం, పూలగూడెం తిరుమల గిరి సాగర్ మండలం లోని గాత్ తండా, తూటిపేట తండా, రంగుళ్ల తండా, పాశంవారి గూడెం, పెద్దభాయ్ తండా, శ్రీరామ్పల్లి ఎల్లాపురం, గరికనేటు తండా తిరుమలగిరి వరకు దాదాపు10 వేల ఎకరాల కు సాగునీళ్లు అందుతుంది .ఈ లిఫ్టు నిర్మాణం కొరకు 2కోట్ల 47 లక్షల రూపాయలు మంజూరుచేశారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువ నిడిది
ఏఎం ఆర్ పి వరద కాలువ డిస్ట్రిబ్యూటరీ కాలువ నిడిది 32 కిలోమీటర్లు. దీని ఆయకట్టు 29 వేల ఎకరాలు ఉండగా ప్రస్తుతం పర్వేదుల వరకు 19వేల ఎకరాలకు మాత్రమే సాగు నీళ్లు అందుతున్నాయి. వరద కాలువకు మూడు మోటర్లలో ఒకమోటర్ నుంచి 130 టిఎంసీలు గేట్ వాల్ పద్దతిలో కుంకుడుచెట్టు లిఫ్టుకు టెక్నీకల్ పర్మిషన్ తో గత ప్రభుత్వం పూర్తి చేసింది. కాని డిస్ట్రిబ్యూటరీ 08-09 కాలువ కంపచెట్లు, బండ రాళ్లు తొలగించలేదు. అయితే ఏఎంఆర్పీ వరద కాలువ సమీపంలో 8,9 డిస్ట్రిబ్యూటరీ దగ్గర వరద కాలువ నీటిని ఎత్తి పోసేవిధంగా సంపు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వరద కాలువ పంపుహౌస్ వరకు పైపు లైన్లు వేసి పైపులైన్ కు వరదకాలువలో ఉన్న మూడు మోటర్ల లో ఒకదానికి గేట్వాల్ పద్ధతిలో కనెక్షన్ ఇచ్చి నప్పుడే నీళ్లు సంపు ద్వారా కాలువలోకి వెళ్తాయి కానీ కానీ ఆ పనులుగత ప్రభుత్వం పూర్తి చేయకపోవడం తో పనులు నిల్చిపోయాయి.
ఎంఎల్ఏ జయవీర్ ర్ చొరవతో పనులు వేగవంతం
నాగార్జున సాగర్ ఎంఎల్ ఏ జయవిర్ చొరవతో సంపునిర్మాణపనులు పూర్తిఅయ్యాయి. గత 10 రోజుల నుంచి 08,09,డిస్ట్రిబ్యూటరీ కాలువలో కంపెచెట్ల తొలగింపు పనులు వేగవంతం అయ్యాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో మెయిన్ కాలువ కంప చెట్లు తొలగింపు పనులు పూర్తి చేయనున్నారు. ఆతరువాత సబ్ డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల చివరికి పనులు పూర్తి చేసి వచ్చే నెలలో కాలువలకు నీటివిడుదల చేయనున్నట్లు సమాచారం.ఎంఎల్ఏ ఆదేశాల ప్రకారం అధికారులు కంపచెట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.కాలువలో మొత్తం కంపచెట్లు బండరాళ్లు పూడిక తొలగించి ప్రస్తుతం లెవలింగ్ చేస్తున్నారు.దాంతోపాటు 8,9 కుంకుడు చెట్టు తండా వెళ్లే పిల్ల కాలువకు మరమ్మతులు చేయాలసి వుంది.వీటన్నిటికీ 2 కోట్ల 42 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేసి గత ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్ఛాక మిగిలి వున్న పనులు పూర్తి చెస్తున్నారు. ఈ సీజన్ లోనే నీటిని విడుదల చేయాలని ఆలోచతో డిస్ట్రిబ్యూటరీల మరమ్మత్తులు చేపడుతున్నారు.
గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: రైతు దండు బిక్షం – బోనూతల
2018 ఉప ఎన్నికల్లో అప్పటి జిల్లామంత్రి కుంకుడు చెట్టు లిప్టూ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అప్పట్లో కొద్దిరోజులు నామ మాత్రంగా పనులు చేపట్టి నిలిపివేశారు కాలువ లిప్టు పూర్తి అయితే 10 వేల ఎకరాకు పైగా సాగునీళ్లు అందేవి. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చి హామీలు గుప్పించారు. లిఫ్టు పనులు పూర్తిచేయక ఇచ్చిన హామీని అమలు చేయక రైతులను మోసం చేసింది. ఇప్పుడు ఎంఎల్ ఏ చొరవతో పనులు వేగవంతం అవుతున్నాయి.
కాలువ లెవలింగ్ పనులు, కంప చెట్ల తొలగింపు పనులు నడుస్తున్నాయి: కళ్లూరీ వెంకటేశ్వర్ రెడ్డి – బోనూతల
ఏఏం ఆర్ పి 8,9 డిస్ట్రిబ్యూటరీ కాలువ కంప చెట్లు,బండ రాళ్లు తొలగించారు. సబ్ డిస్ట్రిబ్యూటరీ
కాలువల లేవలింగ్, కంప చెట్లు తొలగింపు, బండ రాళ్లు తీసే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. వచ్చే నెలలో నీళ్లు విడుదల చేసే అవకాశం వుంది. నీటి విడుదల చెస్తే కుంకుండు చెట్టు లిప్ట్ వెంట రైతుల కలలు సాకారం కానున్నాయి. రూ. 2.42 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కానీ గత ప్రభుత్వం అభివృద్ధిని మరచిపోయింది.