చేనేత భీమాకు వయోపరిమితి ఎత్తివేత

Lifting of age limit for handloom insurance– త్రిఫ్ట్ ఫండ్ పథకంలో ఇక టీం లీడర్ వ్యవస్థ ఉండదు
– చండూరు  సమావేశంలో ఏడి ద్వారక్
నవతెలంగాణ – చండూరు
ప్రభుత్వం అందిస్తున్న, అందించబోయే పథకాలను చేనేతలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఏడి  ద్వారక్ అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం చండూరు చేనేత సహకార సంఘం భవనంలో డిసిసిబి డైరెక్టర్, సహకార సంఘం చైర్మన్ జూలూరు శ్రీను అధ్యక్షతన  నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రిఫ్ట్ ఫండ్ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని ఈసారి  లీడర్ వ్యవస్థ ఉండదని కార్మికులే నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేసుకోవాలని. డబ్బులు సక్రమంగా జమ చేసుకోకపోతే సదర్ కార్మికుడే బాధ్యుడని అన్నారు. త్వరలోనే చేనేత రుణాలు మాఫీ కానున్నయన్నారు. చేనేత భీమాకు వయోపరిమితి సడలించారని, జియో ట్యాగ్ కలిగి ఉండి  మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు వర్తిస్తాయని తెలిపారు. ప్రింటెడ్ చీరలతో  తాము నష్టపోతున్నామని కార్మికులు తెలపగా సమస్యల పైన కార్మికులు సంఘటితంగా ముందుకు పోవాలని సూచించారు. మీకు  మంచి ఎమ్మెల్యే ఉన్నాడని ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందాలని  తెలిపారు. అర్హులైన వారందరికీ జియో ట్యాగ్ నెంబర్లు అందజేస్తామని తెలిపారు. సంఘ చైర్మన్ జూలూరు శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత కార్మికులకు 45 ఏళ్లకే పింఛను ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీఎస్టీ రద్దు చేయాలని,రూ.లక్ష  రుణమాఫీ తో పాటు 2లక్షల రూపాయలు  కొత్తగా రుణాలు అందించాలని ఏడిని కోరారు.  ఏడివో గోపాల్ మాట్లాడుతూ  ఇప్పటివరకు అమలైన పథకాలకు ఎంత మంది లబ్ధి పొందారు   ఏ పథకాల అమలు చేసింది వివరించారు. పలువురు నాయకులు, కార్మికులు మాట్లాడుతూ అర్హులైన వారికి జియో ట్యాగ్ ఇవ్వాలని అలాగే  అనుబంధ కార్మికులకు కూడా జియో టాగ్ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రింటెడ్ చీరలను అరికట్టాలని కోరారు. స్టాండ్ మగ్గాలు ఇతర పరికరాలను అందజేయాలని కోరారు. కళ్యాణ లక్ష్మి పథకంలో చేనేత చీరలను ఇవ్వాలని  కోరారు. రైతులకు మాదిరిగానే మద్దతు ధరతోని చీరలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివో ప్రసాద్, మేనేజర్ తిరందాసు బిక్షమయ్య, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం బిక్షమయ్య, గౌరవ అధ్యక్షుడు పులిపాటి ప్రసన్న, ఉభయ దేవాలయాల ట్రస్ట్ కమిటీ చైర్మన్  కోమటి వీరేశం, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, సంఘ డైరెక్టర్లు చిట్టిపోలు వెంకటేశం, రావిరాల ఓంకారం కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకటేషం, చేనేత పరిరక్షణ సేవా సమితి ఫౌండర్ రాపోలు ప్రభాకర్, అధ్యక్షుడు చెరుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.