యాదాద్రి అదనపు కలెక్టర్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎ.భాస్కర్‌రావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఒకే పార్లమెంట్‌ పరిధిలో మూడేండ్ల సర్వీసు పూర్తయినా, కానట్లుగా ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణపై ఆయనను సస్పెండ్‌ చేశారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు హైదరాబాద్‌లో ఎన్నికల శిక్షణలో ఉన్నట్టు సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదైంది. ఇందుకు సంబంధించి భాస్కర్‌ రావు ఇచ్చిన వివరణ సహేతుకంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.