కాంతి-భ్రాంతి

కాంతి-భ్రాంతిఅవనిని అలుముకున్న
సామాజిక మాధ్యమ రేఖలు…
కల ఏదో కళ ఏదో
కాంతి ఏదో భ్రాంతి ఏదో
తెలియనంతగా నట్టింట
నెట్టింటి వలలు….
కాలాన్ని దూరాన్ని తన గుప్పిట్లోకి
లాక్కన్న సాంకేతిక స్వర దృశ్య లయలు..
మనసులోని స్నేహ లతలు
మాటలోని ప్రేమ కృతులు
అనుబంధ గంధాల అనురాగ శృతులు
మానవతా గీతాల సరిగమలన్నీ…
సెల్‌ అలలలో గిలగిల చేపలు…

శబ్ధాన్ని నిశ్శబ్ధంగా తనలోకి
ఇముడ్చుకున్న మాయపొర
పద సంపదలు వాక్య మధురిమలు
పలకరింపుల పరిమళాలన్నీ నేడు
అర చేతి వైకుంఠపు గడులు
పద కోకిలల కిలకిల ధ్వనులతో
వాక్య కిరణాల వేకువ వెలుగులను
మనో గగనంలో ప్రసరింపజేద్దాం
భద్రమైన జీవన భాగ్యాన్ని తరతరాలుగా
అందిస్తున్న పుస్తక నేస్తాన్ని గుండె గుడిలో నిలుపుదాం..
– వెల్ముల జయపాల్‌ రెడ్డి, 9441168976