నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు

నవతెలంగాణ – తుంగతుర్తి
మండలంలో నాటు సారా స్థావరాలపై శనివారం సీఐ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈమేరకు మండల పరిధిలోని దేవునిగుట్ట తండాలో లాలమ్మ ఇంట్లో 100 లీటర్ల బెల్లం పానకాన్ని, అదేవిధంగా రావులపల్లి గ్రామంలో చింతకుంట్ల ఏకాంత భర్త యాదగిరి వయసు 30 సంవత్సరాలు అనే మహిళ దగ్గర ఐదు లీటర్ల నాటు సారాను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఏడుకొండలు ,ఎక్సైజ్ ఎస్ ఐ కృష్ణమూర్తి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.