
సమారిటన్ ఫర్ ది నేషన్ అనే స్వచ్చంద సంస్థ సౌజన్యంతో అటవీ ప్రాంతంలోని ఆదివాసీ ఆవాసాలు లో వెలుగులు నింపారు. అశ్వారావుపేట మండలం రేగళ్ళ గుంపులో నివాసం ఉంటున్న గుత్తి కోయిల ఆవాసాలు లో సమారిటన్ ఫర్ ది నేషన్ స్వచ్చంద సంస్థ ఆర్ధిక సౌజన్యం 6 సోలార్ విద్యుత్ దీపాలు,పెద్ద మిద్దె ,ఉడుములు బండ మధ్య గుంపులో నివాసం ఉంటున్న గొత్తికోయలు కు 60 వాటర్ వీల్స్ యస్ ఫౌండేషన్ ఆర్ధిక సహకారంతో రూ. 2,40,000 లు వ్యయంతో శనివారం సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా యస్ ఫౌండేషన్ సీఎస్ఆర్ బృందం, సమారిటన్ ఎన్జీఓ బృందం, అశ్వారావుపేట పవన్ కళ్యాణ్ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.