నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఎర్త్ అవర్‌లో భాగంగా శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో లైట్లు ఆర్పేశారు. దేశవ్యాప్తంగా ఇదే సమయంలో ఎర్త్ అవర్‌ను పాటించారు. కొన్ని చోట్ల ప్రజలు కూడా స్వచ్ఛందంగా లైట్లు ఆర్పేసి ఎర్త్ అవర్‌లో భాగస్వాములు అయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాల యంలో కూడా ఇదే సమయంలో లైట్లు ఆర్పేశారు. ఇక్కడి కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి సూర్య భాస్కర్ ఇతర ఉన్నతాది కారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సంస్థ ప్రతినిధులు 60 నెంబర్ ఆకృతిగా ఏర్పడి కొవ్వొత్తులు ప్రదర్శించారు. పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, పలు వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాముల య్యారు. ఈ సందర్భంగా ఆయా ఉన్నతాధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టి ఇలాంటి కార్యక్రమాలు వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గిస్తాయని అభిప్రాయపడ్డారు.