పిల్లల మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తు నడవడికి తల్లిదండ్రుల ప్రవర్తన, పెంపక పద్ధతి కీలక పాత్ర పోషిస్తుంది. సైకలాజికల్ దక్పథంలో పిల్లల భావోద్వేగ అవసరాలు, పరిమితులు, సమర్థతను అర్థం చేసుకుని వారిని ఆ దిశగా మలచడం తల్లిదండ్రుల ప్రధాన బాధ్యత.
తల్లిదండ్రులు పిల్లల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడం
1. తల్లి/తండ్రి మీద ప్రేమను పెంపొందించడం
పిల్లలు మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని, భద్రతను పొందటానికి తల్లిదండ్రుల అన్యోన్యత ముఖ్యం. తల్లిదండ్రుల మధ్య సఖ్యత పిల్లల భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రుల మధ్య అపసమాన్యత వల్ల పిల్లలు చిన్నతనంలోనే అభద్రతా భావానికి లోనవుతారు.
అభద్రతను నివారించేందుకు :
ఙ తల్లిదండ్రులు పిల్లల ముందు తమ వివాదాలను ప్రదర్శించకుండా నివారించాలి.
ఙ కుటుంబంలో ప్రేమ, సఖ్యత వాతావరణాన్ని ప్రోత్సహించాలి.
ఙ పిల్లలు తమ సమస్యలు ఇద్దరి తోటి సమానంగా పంచుకునేలా ప్రోత్సహించాలి. ఇది వారికి సంబంధాలపై నమ్మకం పెంచుతుంది.
2. లక్ష్య సాధనకు ప్రేరణ
పిల్లలు ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని చిన్నతనం నుంచే కలిగి ఉండాలి. వారు ఏదైనా గోల్‌పై ఫోకస్ చేస్తే, అది వారిలో దిశాబద్ధత, స్థిరత్వం, పోరాట పటిమను పెంపొందిస్తుంది.
ఙ చిన్న చిన్న విజయాల కోసం పిల్లలను ప్రోత్సహించండి.
ఙ పొరపాట్లను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి.
ఙ ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ప్రేరేపించండి.
ఙ విజయాలకు ప్రతిఫలాలను కలిగించడం వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని, కషి గుణాన్ని పెంచుతుంది.
3. ఒత్తిడిని పిల్లలపై మోపకూడదు
తల్లిదండ్రుల వ్యక్తిగత ఒత్తిడిని పిల్లలపై చూపడం వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పిల్లలు దీనిని అర్థం చేసుకోలేక, తల్లిదండ్రుల పట్ల నిరాసక్తత లేదా ప్రతిఘటనా భావం కలిగి ఉంటారు.
పరిష్కారాలు :
ఙ పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు తమ భావోద్వేగాలను నియంత్రించాలి.
ఙ పిల్లల సందేహాలను లేదా సమస్యలను ప్రేమగా విన్నాక సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
ఙ పిల్లలతో సాన్నిహిత్యం పెంచడం ద్వారా వారు కూడా తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతారు.
4. తప్పులను అంగీకరించడం నేర్పడం
పిల్లలు తప్పు చేసినప్పుడు, భయంతో అబద్ధం చెప్పడం లేదా బాధ్యత తప్పించుకోవడం సాధారణం. ఇది పెద్దల ప్రతిస్పందన మీద ఆధారపడుతుంది. పిల్లలను నెమ్మదిగా బుజ్జగించడం, బాధ్యతను నేర్పడం ప్రధానంగా గుర్తించబడింది.
మార్గదర్శకాలు:
తప్పులను అంగీకరించడం ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించగలగడం వారికి నేర్పాలి.
పిల్లల మీద అత్యధిక ఒత్తిడి మోపకుండా, తల్లిదండ్రులు తప్పులను సహానుభూతితో అర్థం చేసుకోవాలి.
5. అలకతో వ్యవహరించడం
కొన్ని సందర్భాల్లో పిల్లలు కోపం తెచ్చుకోవడం లేదా అలకబూనడం సాధారణం. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఎంత నెమ్మదిగా వ్యవహరిస్తే, వారు సానుకూలంగా స్పందిస్తారు.
సూచనలు :
వారిని శాంతపరచడం ద్వారా వారి భావోద్వేగాలను అర్థం చేసుకోండి.
అవసరమైతే చిన్న చిన్న బెదిరింపులను వినియోగించవచ్చు, కానీ శారీరక శిక్ష వేయకూడదు.
పిల్లల మానసిక స్థితిపై శాంతమైన పద్ధతులు వారిలో మెరుగైన ప్రవర్తనను ప్రేరేపిస్తాయి.
6. బాధ్యతను నేర్పడం
పిల్లలకు ఇంట్లో చిన్న పనులను అప్పగించడం ద్వారా వారు బాధ్యతాయుతంగా పెరుగుతారు. పిల్లలు ఇంట్లో ప్రతిరోజూ కొన్ని పనులలో భాగస్వామ్యం అయ్యేలా చేయడం వల్ల వారు సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్చుకుంటారు.
అమలు చేయగల వ్యూహాలు :
వారి వయసుకు తగిన పనులను సూచించండి.
చిన్న విజయాలకు ప్రశంసలు ఇవ్వడం ద్వారా వారిలో ఉత్తేజాన్ని పెంచండి.
పిల్లల పెంపకం తల్లిదండ్రుల ప్రేమ, సమన్వయం, మార్గదర్శకతతో ముడిపడి ఉంటుంది. పిల్లలతో మమకారం పెంచడం, వారిలో పాజిటివ్ ఆలోచనల్ని ప్రోత్సహించడం, బాధ్యతను కల్పించడం ద్వారా వారు ఒక సమర్థతతో కూడిన, సానుకూల దక్పథంతో ఎదుగుతారు.
”ప్రేమతో పెంచడం, బాధ్యతతో సాన్నిహిత్యాన్ని పెంపొందించడం పిల్లల విజయానికి మార్గం.”
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్