వేతనం పెంచకపోగా ఉన్న జీతంపైనే కోతలా..?

Without increasing the salary A cut on the existing salary..?– వేతనాలు పెంచాలని టోల్‌ ప్లాజా సిబ్బంది ధర్నా
నవతెలంగాణ-భిక్కనూర్‌
వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ టోల్‌ ప్లాజా వద్ద ప్లాజా కార్మికులు, సిబ్బంది బుధవారం ధర్నా నిర్వహించారు. జనవరి 30న టెండర్‌ ముగియనుండటంతో టీబీఆర్‌ కంపెనీ 20 సంవత్సరాల కాంట్రాక్టు తీసుకున్నట్టు తెలిపారు. 9 సంవత్సరాల నుంచి టోల్‌ప్లాజా వద్ద ఉద్యోగాలు కొనసాగిస్తూ జీవనం గడుపుతున్నామని, ఉన్న జీతమే సరిపోకపోగా.. ప్రస్తుతం నాలుగు వేలు తగ్గించారని, దాంతో ధర్నా నిర్వహించినట్టు తెలిపారు. టోల్‌ ప్లాజా కార్మికులకు అందరికీ కనీస వేతనం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. టీబీఆర్‌ యాజమాన్యాం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో టోల్‌ ప్లాజా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.