ఎగిరే గువ్వలాగా..

ఎగిరే గువ్వలాగా..దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ నిర్మించిన నయా సినిమా ‘శారీ’ (టూ మచ్‌ లవ్‌ కెన్‌ బి స్కేరీ అనేది ట్యాగ్‌లైన్‌’.గిరి కష్ణకమల్‌ దర్శకత్వంలో ఆర్జీవి-ఆర్వి ప్రొడక్షన్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌   వ్యాపారవేత్త రవి శంకర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లోఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సత్య  దు,  ఆరాధ్య దేవి హీరో, హీరోయిన్లుగా పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు.తాజాగా శుక్రవారం ఆర్‌జీవీ మ్యూజిక్‌ డెన్‌ ద్వారా ఈ  చిత్రంలోని సెకండ్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ ‘ఎగిరే గువ్వలాగా…’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జీవీ మాట్లాడుతూ,’ఈ పాట రాకేష్‌ పనికెళ్ళ ట్యూన్‌ చేసి లిరిక్‌ కూడా  తనే ఇచ్చాడు. పాటలో సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సింగర్‌ సాయి చరణ్‌ ఈ పాటను అద్భుతంగా పాడారు’ అని తెలిపారు. ”మా చిత్రంలోని తొలి లిరికల్‌ సాంగ్‌ ‘ఐ వాంట్‌ లవ్‌’కి విశేష స్పందన లభించింది. ‘ఎగిరే గువ్వలాగా…’ పాటను హిందీ, తమిళ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్‌ చేశాం. ప్రస్తుతం సెన్సార్‌ జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని నిర్మాత
రవి శంకర్‌ వర్మ చెప్పారు.