వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. శుక్రవారం ఐదు భాషల్లో ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్ సందేశ్ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు ట్రైలర్‌ని రిలీజ్ చేయగా, తమిళ ట్రైలర్‌ను నిర్మాత మహేంద్రనాథ్ విడుదల చేశారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ, ‘తెలుగులో ఫస్ట్ టైమ్ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశా. తన క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా చేయడం ఏ నటి అయినా సరే ఎగ్జైట్ అవుతుంది. నాకు ట్రైలర్ నచ్చింది. వండర్ ఫుల్ స్క్రిప్ట్‌ని నా దగ్గరకు తీసుకు వచ్చిన దర్శకుడు అనిల్‌కి థ్యాంక్స్. తన బిడ్డను కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ. ‘హనుమాన్’ సినిమాను అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. ఈ ‘శబరి’ని కచ్చితంగా ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది. ఇది స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇస్తుంది. ఈ సినిమా నిర్మాత మహేంద్రనాథ్ కోసం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ముఖ్య అతిథిగా వచ్చిన వరుణ్ సందేశ్‌తో నా రెండో సినిమా చేస్తున్నా. ఆ తర్వాత మూడో సినిమా అమర్ దీప్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమా తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ చెబుతారు. నిర్మాతగా నా తొలి సినిమా ఇది’ అని తెలిపారు.