గత ప్రభుత్వంలా కాంగ్రెస్ మాట తప్పదు

– మేనిపపేస్టో లో ఇచ్చిన హామీలు అమలు చేస్తోంది.
– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు
నవతెలంగాణ-మల్హర్ రావు : గత బిఆర్ఎస్ ప్రభుత్వంలా ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం తప్పదని ఎన్నికల్లో ఇచ్చిన, మేనిపేస్టో లో పెట్టిన హామీలు తప్పకుండా అమలు చేస్తోందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామంలో  కాంగ్రేస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలు గ్రామసభలో దండు హాజరై మాట్లాడారు రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రేస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా  32 రెండు జిల్లాలు తిరుగుతూ అన్ని వర్గాల ప్రజల మనోభావాలు అభిప్రాయాలు తెలుసుకుని,విద్యార్థులకు,నిరుద్యోగులకు,మహిళలకు,వృద్దులకు,ఒంటరి మహిళలకు,వితంతువులకు,వికలాంగులకు,రైతులకు అన్ని వర్గాల ప్రజలకు లబ్ది జరిగేలా మ్యానిఫెస్టోలో పొందుపరచడం జరిగిందన్నారు.కాంగ్రేస్ పార్టీ అంటే మాట తప్పదు మడమ తిప్పదని  అనుకున్నట్టుగానే 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయడానికె ఈ దరఖాస్తు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ప్రజలతో అధికారులు చాలా ఓపికగా మసులుకోవాలని విజ్ఞప్తి చేశారు.అధికారుల కృషితోనే ప్రభుత్వానికి  మంచి పేరు వస్తుందన్నారు.గత ప్రభుత్వంలో పథకాలను ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని, కాంగ్రేస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇవ్వడమే కాక ఇది పూర్తిగా ప్రజా ప్రభుత్వమన్నారు.అర్హులైన పేదలకు  అందరికి ఖచ్చితంగా ఈ పథకాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.