లిల్లీపుట్ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర..

Lilliput school students outing.. నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని  లిల్లీపుట్ పాఠశాల లోని విద్యార్థులు శనివారం  విహార యాత్రకు బయలుదేరినారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను నిర్మల్ లోని అర్బన్ పార్క్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఎంతో చక్కగా ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖమైన దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ  మాట్లాడుతూ తమ పాఠశాలలోని విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లామని ఇలా విహారయాత్రకు తీసుకడం వల్ల విద్యార్థులలో మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని చదువుతోపాటు వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతామని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు  ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాల రామకృష్ణ , ప్రిన్సిపాల్ దాసు , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.